Logo
Date of Publish : 09 September 2026, 11:56 am
Editor : Janapati Venkata Ramesh Babu

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్స్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి -SFI

యూనివర్సిటీ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలి-SFI

అకడమిక్ కన్సల్టెంట్స్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి, ఫలితాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ జ్యోతి కుమార్ కు బుధవారం తన చాంబర్లో కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్, జిల్లా అధ్యక్షులు తరిమెల గిరి, యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, పవన్ మాట్లాడుతూ!ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరిగిన అకడమిక్ కన్సల్టెంట్స్(బోధన సహాయకులు) ఉద్యోగుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు జరిగి పది రోజులు కావస్తున్న ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు.దీనివల్ల యూనివర్సిటీ బయట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆ రకమైన ఊహాగాలకు అడ్డకట్ట వేస్తూ మీరు వెంటనే ఫలితాలు విడుదల చేయాలిని ఎస్ఎఫ్ఐ గా మేం డిమాండ్ చేస్తున్నాం. ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేక కేవలం ఆ ఉద్యోగులపై ఆధారపడిన విభాగాలలో తరగతులు బోధించేవారు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈనెల 2వ తేదీ నుంచి మూడవ సెమిస్టర్ తరగతులు ప్రారంభమైన బోధన సిబ్బంది లేకపోవడంతో చాలా విభాగాలలో ఇప్పటివరకు తరగతులు జరగలేదు.దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వర్సిటీలో ప్రశాంత వాతావరణన్ని నెలకొల్పి తరగతులు సక్రమంగా జరిపించాల్సిన ప్రిన్సిపాల్ ఫలితాలను అడ్డుకొని విద్యార్థులను గాలికి వదిలేసి తన పంతం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయం మీకు తెలిసి కూడా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం.ఆయనపై వెంటనే చట్టపరమైన తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. అకడమిక్ కన్సల్టెంట్స్ ఇంటర్వ్యూ ఫలితాలను వెంటనే విడుదల చేసి వర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుటకు కృషి చేయాలని లేని పక్షంలో రాబోవు కాలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము డిమాండ్ చేస్తూ మీకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, మల్లేష్, ఓబులేసు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Amaravathi Velugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • న్యూస్
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • న్యూస్
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )