Logo
Date of Publish : 16 September 2026, 6:24 am
Editor : Janapati Venkata Ramesh Babu

పేదల వైద్యానికి భరోసా.. కూటమి ప్రభుత్వం

34 మంది లబ్ధిదారులకు రూ.46.01 లక్షల CMRF చెక్కులు

కదిరి, (అమరావతి వెలుగు): అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

కదిరి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ వసతిగృహంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 34 మంది లబ్ధిదారులకు రూ.46,01,038 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్న నేపథ్యంలో సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. పేదల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

రూ.5.95 కోట్లకు పైగా సాయం

కదిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 688 మంది లబ్ధిదారులకు రూ.5,95,46,823 సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పేదలు, బలహీనవర్గాల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందడంతో తమ కుటుంబాలకు ఎంతో ఊరట లభించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )