Logo
Date of Publish : 16 September 2026, 12:48 pm
Editor : Janapati Venkata Ramesh Babu

వాడవాడలా కొలువుదీరిన వినాయకులు – భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకల

ఎన్ పి కుంట , సెప్టెంబర్ 15:

మండలంలో వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం వాడ వాడలా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మండలంలోని ఎన్ పి కుంటlo 16 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. రెడ్డివారి పల్లి ,టి ఎన్ పల్లి, వెలిచలమల, ధనియాని చెరువు, వంకమద్ది, తిమ్మమ్మ మర్రిమాను, పెడబల్లి ల లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు ఉండ్రాళ్లు, కుడుములు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

 

మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి మండపాలు కోసం దరఖాస్తు చేసుకోగా వారందరికీ వినాయక మండపాలు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు ఎస్ ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్ ఐ మండపాల నిర్వాహకులకు సూచించారు.డీజేలకు అనుమతి లేదని, సినిమా పాటలు రాజకీయ నాయకులకు సంబంధించిన పాటలు ప్రదర్శించరాదని, కేవలం వినాయకుని భక్తి పాటలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడ్డివారి పల్లెలోని,బీసీ హాస్టల్ వద్ద బాల గణేష్ ని విగ్రహం, అంబేద్కర్ కాలనీలోని మట్టి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. వివిధ గ్రామాలలో వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండలమంతా ‘గణపతి బప్పా మోరియా’ నామస్మరణతో భక్తిభావం వెల్లివిరిసాయి. గ్రామాలలో కోలాటం నేర్చుకోవటం వల్ల ఆయా గ్రామాలలో వినాయక మండపాల వద్ద కోలాటం ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )