Logo
Date of Publish : 13 September 2026, 3:44 am
Editor : Janapati Venkata Ramesh Babu

సీతారాం ఏచూరికి ఘన నివాళి

కదిరి:(అమరావతి వెలుగు):- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కదిరిలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జీఎల్‌ నరసింహులు నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన సీతారాం ఏచూరి ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో ప్రస్తావించారని పేర్కొన్నారు. మార్క్సిస్టు పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడటమే ఏచూరికి నిజమైన నివాళి అని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జగన్మోహన్, పట్టణ కమిటీ సభ్యులు రామ్మోహన్, బాబ్జాన్, సుధాకర్‌రెడ్డి, నారాయణ, కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )