Logo
Date of Publish : 17 September 2026, 10:11 am
Editor : Janapati Venkata Ramesh Babu

కదిరిలో మోదీ జన్మదిన వేడుకలు

ఆలయంలో ప్రత్యేక పూజలు...'ఆశీర్వాద దీపం' కార్యక్రమానికి పిలుప

కదిరి,(అమరావతి వెలుగు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను కదిరిలో భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మోదీ పేరున ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించారు. దేశ ప్రజలకు మరింత కాలం సేవలందించే శక్తిని స్వామివారు ప్రధానికి ప్రసాదించాలని భాజపా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్. పార్థసారథి ప్రార్థించారు.

మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆశీర్వాద దీపం–మన ఇంట్లో ఒక దీపం, ఒక ఆశీర్వాదం’ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం కదిరి పట్టణ భాజపా ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్, హాస్పిటల్‌ బోర్డు డైరెక్టర్ సామల కేశవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పిట్ల రామకృష్ణ, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు జయరాజ్, నాయకులు క్రిష్టప్ప, ఆవుల శంకర, యువమోర్చా రాష్ట్ర నాయకుడు హరి నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి బుడగల హరీష్‌బాబు, రిహానా, పూజ, మధు, వాల్మీకి హరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )