Amaravathi Velugu
Date of Publish : 26/10/2026, 9:06 pm
Published by Janapati Venkata Ramesh Babu

చాటగుట్ల సబ్‌స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్‌ అంతరాయం

  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత

పొదలకూరు

 అమరావతి వెలుగు

అక్టోబర్ 26

చాటగుట్ల విద్యుత్‌ ఉపకేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం (అక్టోబర్ 27) విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్‌ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పొదలకూరు విద్యుత్‌ శాఖ ఏఈ జె. రఘు తెలిపారు.

ఈ అంతరాయం కారణంగా మరుపూరు, చాటగుట్ల, బిరదవోలు, ముత్యాలపేట, కళ్యాణపురం, బ్రాహ్మణపల్లి గ్రామాల ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save