Amaravathi Velugu
Date of Publish : 26/10/2026, 11:24 pm
Published by Janapati Venkata Ramesh Babu

27, 28వ వార్డుల్లో కూటమి జోరు!

  • ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి, (అమరావతి వెలుగు): కదిరి మున్సిపాలిటీలో కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 27, 28వ వార్డుల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఇంటింటా పర్యటించి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రచారానికి వచ్చిన నాయకులకు స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.నవంబరు 1న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ అర్షియా భానుతోపాటు 28వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి అజిముల్లా, 27వ వార్డు అభ్యర్థి తుమ్మల అర్బజ్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు.ప్రజల నుంచి లభించిన స్పందనతో కూటమి నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save