Amaravathi Velugu
Date of Publish : 27/10/2026, 1:53 pm
Published by Janapati Venkata Ramesh Babu

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సూన్యం...వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి బచ్చల. సురేష్ కుమార్ రెడ్డి

పొదలకూరు 

అమరావతి వెలుగు 

పొదలకూరు మండలం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి బచ్చల. సురేష్ కుమార్ రెడ్డి, ఎంపిటిసి సువిసర్ల. వాణి, విరువూరు గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం బచ్చల. సురేష్ రెడ్డి, మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం అనేక సంఘక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సూన్యమన్నారు. పొదలకూరు మండలం అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save