Amaravathi Velugu
Date of Publish : 27/10/2026, 7:31 pm
Published by Janapati Venkata Ramesh Babu

ప్రజల నుండి వైసీపీ కి అనూహ్య స్పందన వస్తుంది... మాజీ మంత్రి కాకాణి

  • 30 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో చేరారు.

పొదలకూరు 

అమరావతి వెలుగు :

పొదలకూరు మండలం దుగ్గుంట పంచాయతీ కొనగలూరు గ్రామంలో మాజీమంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి, మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాములవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకాణి, ఇంటింటికి తిరిగి వైసీపీ జడ్పీటిసి అభ్యర్థి బచ్చల. సురేష్ రెడ్డి, ఎంపిటిసి అభ్యర్థి బండి. చిన్నయ్య,కు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 30 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల నుండి టీడీపీలో కొనసాగుతున్న నాయకులు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిఒక్కరు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతురెడ్డి. రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కనిమేకల. వెంకటరమణయ్య, మందారపు. సుందరరామయ్య, కొండూరు. కిరణ్ రాజు, చినపొండయ్య, ముప్పాల. నరసింహరాజు, మందారపు. మెహన్, మందారపు. జనార్దన్, ఓబుల్ రెడ్డి, వాసిలి. రవి, తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save