Amaravathi Velugu
Date of Publish : 28/10/2026, 12:57 pm
Published by Janapati Venkata Ramesh Babu

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి...బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి

  • అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు
  • ఎమ్మార్వో కాలనీలో జోరుగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
  • ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు
  • కాకాణి హయాంలోనే పొదలకూరుకు అభివృద్ధి ఫలాలు
  • వైఎస్సార్‌సీపీ విజయాన్ని జగనన్న, కాకాణికి కానుకగా ఇద్దాం

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు*: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయాన్ని కానుకగా అందించాలని వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి (చిన్ని) ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పొదలకూరులోని ఎమ్మార్వో కాలనీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులతో జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పొదలకూరు బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి గంగవరపు లక్ష్మీకళ్యాణి, బిట్‌-2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య, బిట్‌-3 ఎంపీటీసీ అభ్యర్థి కోవూరు వెంకటేశ్వర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరులో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. ఒకప్పుడు కనీసం నడిచేందుకు కూడా వీలులేని వీధులను సీసీ రోడ్లతో అభివృద్ధి చేశామని, వర్షాకాలంలో మురుగునీరు, వరద నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సైడ్ కాలువల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని పేర్కొన్నారు.

*కాకాణి నాయకత్వమే సర్వేపల్లి అభివృద్ధికి చిరునామా*

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసిన ఘనత కాకాణికే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.

పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా తనను, బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా గంగవరపు లక్ష్మీకళ్యాణిని, బిట్‌-2 ఎంపీటీసీ అభ్యర్థిగా వాకాటి సంధ్యను, బిట్‌-3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

*స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేద్దాం*

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని అభ్యర్థులు కోరారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్వో కాలనీలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save