Amaravathi Velugu
Date of Publish : 28/10/2026, 1:04 pm
Published by Janapati Venkata Ramesh Babu

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరులోని శ్రీ వినాయక, కామాక్షి తాయి రామలింగేశ్వర దేవస్థానంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కుమార్ స్వామి అయ్యప్ప స్వామి, వినాయకుడు, శివయ్య, కామాక్షమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. షేక్ సుల్తాన్ (పిటిడి) కానిస్టేబుల్ అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములు ఆయనను కండువాతో సత్కరించి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, శివాడ పరంధామి రెడ్డి, బ్రహ్మదేవి రాజశేఖర్, గోళ్ళ రమణయ్యతో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save