Amaravathi Velugu
Date of Publish : 28/10/2026, 11:00 pm
Published by Janapati Venkata Ramesh Babu

ఘనంగా అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం...

  • నాలుగు సంవత్సరాలనుండి క్రమంతప్పకుండా స్వాములకు బిక్ష ఏర్పాటు...
  • షేక్ సుల్తాన్ (పిటిడి) కానిస్టేబుల్

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరులోని శ్రీ వినాయక, కామాక్షి తాయి రామలింగేశ్వర దేవస్థానంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ షేక్ సుల్తాన్ (పిటిడి) కానిస్టేబుల్ గత నాలుగు సంవత్సరాలనుండి క్రమం తప్పకుండా అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయ్యప్ప స్వామి అశీసులు ఎల్లప్పుడూ సుల్తాన్ పై ఉండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అయ్యప్ప స్వామి ఆశీర్వాదించాలని తెలిపారు. అనంతరం అయ్యప్ప స్వాములు ఆయనను కండువాతో సత్కరించి పూలమాల వేశారు. రాత్రి అయ్యప్ప భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, శివాడ పరంధామి రెడ్డి, గోళ్ళ రమణయ్య, కాసా. శ్రీనివాసులు, ప్రసాద్, నరేంద్ర రెడ్డి, కాసా. వెంకట్, సాయి, శివ, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save