Amaravathi Velugu
Date of Publish : 29/10/2026, 11:03 pm
Published by Janapati Venkata Ramesh Babu

ప్రజల్లో రోజు రోజు వైసీపీకి పెరుగుతున్న ఆదరణ...కాకాణి. పూజిత,

అమరావతి వెలుగు

 పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు మండలం, మహ్మదాపురం గ్రామంలో జడ్పీటీసీ, అభ్యర్థి బచ్చల. సురేష్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ, అభ్యర్థి కీలు కుప్ప కృష్ణవేణి, కి మద్దతుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలన్న పిలుపుకు భారీ స్పందన వస్తుందన్నారు. జగనన్న సంక్షేమ పాలన కోసం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్న సమయంలో ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. తాము ఓట్లు అడగకముందే పలువురు ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకత పాలకపక్షానికి కూడా అర్థమైందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save