Amaravathi Velugu
Date of Publish : 30/10/2026, 8:35 pm
Published by Janapati Venkata Ramesh Babu

కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులతో ప్రజల్లోకి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు..

  • పొదలకూరు మస్తాన్‌రెడ్డి నగర్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం*
  • ● గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు
  • ● వైఎస్‌ జగన్‌ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన
  • ● ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ.

పొదలకూరు పట్టణంలోని మస్తాన్‌రెడ్డి నగర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిట్‌–1,2,3 ఎంపీటీసీ అభ్యర్థులు గంగవరపు లక్ష్మి కళ్యాణి, వాకాటి సంధ్య, కోవూరు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి ప్రజలను నేరుగా కలుసుకుని పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమ పథకాలతో పేదలకు అండ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు లబ్ధి చేకూరిందని అభ్యర్థులు ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించిన ప్రయోజనాలను గుర్తించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.

కాకాణి నాయకత్వంపై విశ్వాసం

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ప్రజల ఆదరణతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

"ప్రజలకు అందుబాటులో ఉంటాం

స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేయడమే తమ లక్ష్యమని అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, స్థానిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save