Amaravathi Velugu
Date of Publish : 31/10/2026, 9:06 am
Published by Janapati Venkata Ramesh Babu

కళ్యాణపురంలో సుమలత ప్రచార హోరు

  • బిరదవోలు అభివృద్ధికి అండగా నిలవండి
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ నాయకుల విజ్ఞప్తి
  • ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా -సుమలత

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:

పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలం బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థిని అన్నలూరు సుమలత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం సాయంత్రం కళ్యాణపురం గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో తనతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థిని సుమలత మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

*కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం*

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. స్థానిక సంస్థలు బలోపేతమైతేనే గ్రామాలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేరుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో బిరదవోలు సెగ్మెంట్‌లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కళ్యాణపురంలో టీడీపీ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు అన్నలూరు చెన్నకృష్ణమ నాయుడు, వెన్నపూస రమణారెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి, ఎత్తపు వెంకటరెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ్, రావుల భాస్కర్ గౌడ్, బడుగు సూర్యనారాయణ, వంపులూరు శ్రీనివాసులు గౌడ్, బిజెపి నాయకులు ముక్కు రామయ్య గౌడ్ తదితరులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save