Amaravathi Velugu
Date of Publish : 31/10/2026, 7:53 pm
Published by Janapati Venkata Ramesh Babu

రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ.

పొదలకూరు ఉపసర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డికి శనివారం పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వాకాటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. తన భార్య వాకాటి సంధ్య పొదలకూరు బిట్‌-2 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు తనకు నోటీసులు అందజేయడం ఎన్నికల కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకే ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save