Amaravathi Velugu
Date of Publish : 31/10/2026, 7:56 pm
Published by Janapati Venkata Ramesh Babu

మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు పట్టణంలో వైసీపీ నాయకుడు వాకాటి శివారెడ్డి మాట్లాడుతూ.. రుస్తుం మైన్స్‌ విషయంలో తాము ఎలాంటి లబ్ధి పొందలేదని స్పష్టం చేశారు. మా బిడ్డల సాక్షిగా ఈ విషయం చెబుతున్నానని, వినాయకుడి ముందు ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ కేసుల కారణంగా తాను 60 రోజులు జైలులో ఉన్నానని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడాన్ని పక్కనపెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడంలో కూటమి ప్రభుత్వం ముందుందని విమర్శించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save