అమరావతి వెలుగు
పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ
పొదలకూరు: పరిషత్ ఎన్నికల వేళ పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. పొదలకూరు బిట్-4 పరిధిలోని వెంకటేశ్వర నగర్ (తోకంచి) గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదలకూరు టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మండల పార్టీ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు సమక్షంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కరియావుల శ్రీనివాసులు నాయుడు, కరియావుల నారప నాయుడు, దేవినేని సురేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మస్తాన్ బాబు మాట్లాడుతూ.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో పొదలకూరు మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోస్తూ గ్రామాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సోమిరెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. పొదలకూరు పంచాయతీలోని నాలుగు ఎంపీటీసీ సెగ్మెంట్లలోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లో చేరిన వారిలో పంతగిరి అఖిల్, పంతగిరి శ్రీనయ్య, తలపాల గోపాలయ్య, యాకసిరి అంకయ్య, పంతగిరి అనిల్, మణికాల హరిప్రసాద్, నిమ్మల సుబ్బయ్య, నిమ్మల కిష్టయ్య, కలగండల సునీల్, పువ్వడి వినుకొండయ్య, యాకసిరి సుధాకర్, కొమ్మల పెంచలయ్య, కదిరి కిష్టయ్య, కత్తి శ్రీనయ్య, యాకసిరి వేణు, పంతగిరి అంకయ్య, పంతగిరి చిన్న అంకయ్య, పంతగిరి అశోక్, పంతగిరి వెంకటరమణ, త్రివిడి దినేష్ తదితరులు ఉన్నారు.