Amaravathi Velugu
Date of Publish : 02/11/2026, 4:18 pm
Published by Janapati Venkata Ramesh Babu

వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక...

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు పట్టణం యాదవ వీధికి చెందిన వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ మండల అధ్యక్షుడు, పిఏసిఎస్ చైర్మన్ తలచీరు. మస్తాన్ బాబు, టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి అండగా ఉంటామన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రతిఒక్కరు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటిసి అభ్యర్థి కలిచేటి. ప్రభాకర్ రెడ్డి, బిట్-2 టీడీపీ ఎంపిటిసి అభ్యర్థి మలిశెట్టి. శివ శంకర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు. మల్లికార్జున్ నాయుడు, రైతు సంఘం నాయకుడు కోవూరు. బక్కయ నాయుడు, నాయకులు సందీప్, వీరేంద్ర, శివ, తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save