Amaravathi Velugu
Date of Publish : 07/11/2026, 7:59 am
Published by D BHASKAR

చీకటి ప్రయాణం..

  • కరెంట్ పోతే ఇక అంతా చీకటే.
  • ️పొదలకూరు ఆర్టిసీ డిపోలో కనీస వసతులు కరువు.

పొదలకూరు అమరావతి వెలుగు 

ప్రతినిధి దేవరకొండ భాస్కర్ 

పొదలకూరు ఆర్టిసీ డిపోలో కనీస వసతులు కరువయ్యాయి.. ఒకదాన్ని మించి మరో సమస్యలు వేధిస్తున్నాయి.. పై చిత్రం శుక్రవారం రాత్రి 7:30 సమయంలో తీసినది.. కరెంట్ లేకపోవడంతో చీకట్లోనే ప్రయాణీకులు తమ ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.. కనీసం ఇన్వెర్టర్ వసతి కూడా లేదు.. చీకట్లోనే బస్సు కండక్టర్లు సైతం సెల్ ఫోన్ లో టార్చి లైట్ సాయంతో బస్సు దిగి రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారు.. ఇక ప్రయాణీకుల పరిస్థితి చెప్పనక్కర్లేదు మధ్యలో ఇంకెక్కడా బస్సు ఆపరనే భయంతో చీకటయినా సరే చచ్చినట్లు ఆర్టిసీ డిపోకు వస్తున్నారు. 

*కనీస వసతులు కరువు*

డిపో పునః ప్రారంభించి సుమారు ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.. అలాగే ఒక చిన్న ఇన్వెర్టర్ కూడా లేదు.. అలాగే వర్షం వస్తే డిపోలికి వెళ్లే దారిలో మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచిపోతాయి.. ఇక టాయిలెట్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ డిపోలో పైన తెలిపిన కనీస అవసరాలు తెరిస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save