Amaravathi Velugu
Date of Publish : 07/11/2026, 6:29 pm
Published by D BHASKAR

అమరావతి పాఠశాలలో నరక చతుర్దశి – ముందస్తు దీపావళి ( లక్ష్మీ పూజ) వేడుకలు

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:అమరావతి పాఠశాలలో నరక చతుర్దశి మరియు ముందస్తు దీపావళి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ, నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరకాసుర వధను తెలియజేస్తూ, దీపావళి పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు.

ఈ సందర్భంగా *అమరావతి పాఠశాల కరస్పాండెంట్ కె. సురేష్ గారు* మాట్లాడుతూ, చిన్నారులకు చిన్ననాటి నుంచే మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టత గురించి తెలియజేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ పద్ధతుల్లో పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆనందోత్సాహాల మధ్య ముందస్తు దీపావళి వేడుకలు వైభవంగా ముగిశాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save