అమరావతి వెలుగు పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ
పొదలకూరు:బచ్‌పన్ స్కూల్‌లో దీపావళి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆనందంగా దీపాలు వెలిగించి, కాకరపువ్వులు, భూచక్రాలు కాల్చి సందడి చేశారు. అనంతరం పాఠశాలలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పిల్లల భవిష్యత్తు అంతా బాగుండాలని, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
"చీకటిని తరిమే చిరుదీపంలా.. చిన్నారుల భవిష్యత్తు ఎల్లప్పుడూ జ్ఞానపు వెలుగులతో ప్రకాశించాలని కోరుకుంటూ... అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు.
EDITOR : Janapati Venkata Ramesh Babu