Amaravathi Velugu
Date of Publish : 12/11/2026, 1:48 pm
Published by THAYANNA

వీధి కుక్కలకు భద్రత లేదా..? రోడ్డుపై హృదయ విదారక ఘటన!..

  • వీధి కుక్కలకు. ప్రాణాలకు భద్రత లేదా? మూగజీవుల ప్రాణాలు కూడా విలువైనవే కదా!

కౌతాళం మండం : హల్వి గ్రామం ఇందిరా గాంధీ నగర్ కాలనీలో రోడ్డుపై కనిపించిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఒక చిన్న కుక్కపిల్ల రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం బాధాకరం. పక్కనే తల్లి కుక్క దీనంగా నిలబడి ఉన్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.

వీధి కుక్కలకు సరైన రక్షణ లేకపోవడం, రోడ్లపై ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించే విషయం. మూగజీవుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..

అధికారులు స్పందించాలి!

- వీధి కుక్కల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.

- రోడ్లపై మూగజీవులకు ప్రమాదాలు జరగకుండా చూడాలి.

- గాయపడిన జంతువులకు వెంటనే వైద్య సహాయం అందించాలి.

- జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ దయతో వ్యవహరించాలి...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save