Amaravathi Velugu
Date of Publish : 12/11/2026, 6:48 pm
Published by THAYANNA

కర్నూల్ జిల్లాపరిషత్ చైర్మన్ వాల్మీకి చూడి ఉలిగయ్య గారికి కేటాయించాలి - ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన

కౌతాళం అమరావతి వెలుగు(ప్రతినిధి) NOV 12/26

కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ వాల్మీకులకు కేటాయించాలని వాల్మీకి విద్యార్థి సేన కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు.టిడిపి తరఫున కౌతాళం మండల జెడ్పిటిసి గా భారీ మెజార్టీతో గెలుపొందిన ఉలిగయ్యకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.ఉలిగయ్య టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది.బిసి సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకుల్లో ఉలిగయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.వార్డు నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు టిడిపి గెలుపు కోసం కృషి చేయడం జరిగిందన్నారు.కావున జడ్పీ చైర్మన్ పదవిని చూడి ఉలిగయ్య గారికి కేటాయించాలని కోరుతున్నాం అని తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save