పొదలకూరు శ్రీ గాయత్రి స్కూల్లో కృష్ణపట్నం పోర్టుకు సంబందించిన ఎస్ఈఐఎల్ సంస్థ వారు శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జనరేషన్లో విద్యార్థుల కంటి చూపుపై సెల్ ఫోన్ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. తద్వారా చిన్న వయసులోనే కంటి శుక్లాలు దెబ్బతిని కళ్లద్దాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఎస్ఈఐఎల్ సంస్థ వారు తమ స్కూల్లో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు.

EDITOR : Janapati Venkata Ramesh Babu