Amaravathi Velugu
Date of Publish : 13/11/2026, 6:35 pm
Published by THAYANNA

కోసిగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు,వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు!

కోసిగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ శ్రీ ఎన్.రామకృష్ణ రెడ్డి గారి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు!

*ఈ సందర్భంగా హరిజన వీరేష్, హరిజన దొరస్వామి, హరిజన ప్రభు, హరిజన సుందర్ రాజ్, హరిజన యేసయ్య, దాసరి భీమయ్య, హరిజన పెద్ద భీమయ్య, హరిజన సల్మాన్, బోయ హుసేని తదితరులతో పాటు దాదాపు 10 కుటుంబాల వారు టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు.!

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గారు వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని భరోసానిచ్చారు.

మంత్రాలయం నియోజకవర్గంలో శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో సాతనూరు టిడిపి నాయకులు నాగేంద్ర, రామిరెడ్డి, రాజశేఖర్, వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు!

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save