Amaravathi Velugu
Date of Publish : 13/11/2026, 7:53 pm
Published by THAYANNA

తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ అధినేత్రి కవిత అక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

తెలంగాణ కుమ్మరి శాలివాహన ముద్దుబిడ్డ కొల్లూరు ఆకాష్‌కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత అక్కకు తెలంగాణ కుమ్మరి శాలివాహన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలంగాణ ఉద్యమ నాయకుడు, కుమ్మరి వెంకటేష్ శాలివాహన తెలిపారు.

కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడికి రాజకీయంగా గుర్తింపు, ప్రాధాన్యత కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కుమ్మరి శాలివాహన సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

రాజకీయ, సామాజిక రంగాల్లో కుమ్మరి కులస్తులకు సముచిత అవకాశాలు కల్పించాలని, అన్ని పార్టీల నాయకత్వాలు కుమ్మరి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

కుమ్మరి శాలివాహన సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇట్లు:

తెలంగాణ ఉద్యమ నాయకులకు

కుమ్మరి శాలివాహన, కుమ్మరి సంఘం

జిల్లా కోశాధికారి, గారికి. ధన్యవాదాలు.

జై కుమ్మరి! జై శాలివాహన!! 

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save