కౌతాళం అమరావతి వెలుగు న్యూస్ నవంబర్ 14
కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, ప్రజలతో మమేకమై ప్రజాసేవలో ముందుండే C. ఉలిగయ్య గారికి కేటాయించాలని బోయ వాల్మీకి సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి లావణ్య గారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన C. ఉలిగయ్య గారు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించారని
బోయ వాల్మీకి సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తలారి లావణ్య గారు. పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలోనూ అండగా నిలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన మంచి మనసున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు.
కర్నూలు జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి గణనీయమైన జనాభా ఉన్నప్పటికీ, రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని. బోయ వాల్మీకి సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి లావణ్య గారు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, రాజకీయ సమతుల్యత దృష్ట్యా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు.
C. ఉలిగయ్య గారికి జడ్పీ చైర్మన్ పదవి కల్పిస్తే వాల్మీకి సామాజిక వర్గానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని బోయ వాల్మీకి సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తలారి లావణ్య గారు, అన్నారు.
కాబట్టి ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, పార్టీకి అంకితభావంతో సేవలు అందించిన C. ఉలిగయ్య గారికి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కల్పించాలని బోయ వాల్మీకి సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తలారి లావణ్య గారు. డిమాండ్ చేశారు.
EDITOR : Janapati Venkata Ramesh Babu