Amaravathi Velugu
Date of Publish : 14/11/2026, 6:40 pm
Published by D BHASKAR

అమరావతిలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు.

  • 500 మందికి పైగా విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఆటపాటలతో సందడిగా మారిన పాఠశాల ప్రాంగణం.

పొదలకూరు మండలంలోని అమరావతి పాఠశాలలో నవంబర్ 14న భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, కేరింతలు, ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో వివిధ రకాల ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక బహుమతులను అందజేసింది. ఈ వేడుకల్లో భాగంగా దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు బహుమతులు అందుకోవడం విశేషంగా నిలిచింది. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కె. సురేష్ గారు మాట్లాడుతూ... విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అంశాలు, జీవితానికి అవసరమైన వివిధ విషయాలపై అవగాహన కల్పించడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అమరావతి పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ బాలల దినోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, సిబ్బందికి, విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save