Amaravathi Velugu
Date of Publish : 14/11/2026, 6:54 pm
Published by D BHASKAR

శ్రీ గాయత్రి స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

పొదలకూరు ప్రతి ఒక్కరి జీవితాల్లో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకమని శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక శ్రీ గాయత్రి స్కూల్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలత చాచా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలందరికి స్వీట్లు, చాకెట్లు పంచి పెట్టారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సామాజిక బాధ్యతల గురించి చక్కగా వివరించారు. బాల్యంలో ఉన్నతమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోవలన్నారు, లక్ష్యం సాధించే వరకు అలసిపోకూడదన్నారు.. చివరిగా చిత్రలేఖనం, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save