Amaravathi Velugu
Date of Publish : 15/11/2026, 3:56 pm
Published by THAYANNA

ఎరిగేరి గ్రామంలో దళిత హనుమంతు పొలంలో మిరప పంటను ధ్వంసం చేసిన అల్లరి మొక్కలను శిక్షించాలి..

  • రెండు మోటర్లు పైపులను ముక్కలు ముక్కలుగా నరికినారు.
  • పైపులు ,మిరప పంట నష్టము, సుమారు 6 లక్ష రూపాయలు ఉంటుంది.

కౌతళం. అమరావతి వెలుగు న్యూస్ (ప్రతినిధి)నవంబర్ 15

ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు పొలంలో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై ,అప్పులు తీర్చడానికి రైతులు ఇతర ప్రాంతాలకు గ్రామాలకు, గ్రామాలు ప్రజలు పిల్లాపాపలతో వలసలు పోయినారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎరిగేరి గ్రామంలో దళిత హనుమంతు సీడు మిరప వేసినడు .అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు హనుమంతు వేసిన పత్తి పంటను గొర్రెలతో మేపినారు . నా పొలంలో ఇంకా నేను పత్తి కూడా ఏరలేదు ,అప్పుడే ఎందుకు పత్తి పంటను మేపినారు అని గట్టిగా నిలదీసి అడిగితే ,ఆ గొర్రెల మందుల వాళ్ళు అరే మాదిగ లంజా కొడకా ,నీకు ఎంత పొగరులే , నీ అంత చూస్తాం ,నీవు ఎట్లా తిరుగుతావు అని బెదిరించినారు. అదే రోజు రాత్రికి హనుమంతు పొలం లో మిరప పంటను, మోటార్ల పైపులను ఆయుధాలతో ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య గారు అన్నారు.

ఈ రోజు రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు దళిత హనుమంతు మిరప పంటను నష్టపరిచిన పొలాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి సంఘటనలను, పైపులు నష్టము , మిరప పంట నష్టము సుమారుగా 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు అంచన వేసినారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మల్లయ్య ,గారు నాయకులు అసాధి వీరేష్ ,చిన్న వీరేష్, హనుమంతు ,దావీదు తదితరులు పాల్గొన్నారు.. 

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save