Amaravathi Velugu
Date of Publish : 16/11/2026, 8:22 am
Published by THAYANNA

కుంబలనూరు క్యాంపుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.

  • కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కౌతాళం మండల టీడీపీ జనరల్ సెక్రటరీ వల్లూరు పట్టాభి గారు..

కౌతాళం అమరావతి వెలుగు న్యూస్ ప్రతినిధి నవంబర్16.

కుంబలనూరు క్యాంపుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు అని కౌతాళం మండల టీడీపీ జనరల్ సెక్రటరీ వల్లూరు పట్టాభి అన్నారు.

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సదరు టీడీపీ సీనియర్ కార్యకర్త నిన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కౌతాళం మండల టీడీపీ జనరల్ సెక్రటరీ వల్లూరు పట్టాభి వెంటనే స్పందించి వారి మృతదేహం వద్దకు చేరుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాకుండా కుటుంబానికి తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా వల్లూరు పట్టాభి మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన సీనియర్ కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని అన్నారు. పార్టీ కార్యకర్తలు కేవలం కార్యకర్తలు మాత్రమే కాదని, కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. ఆపద సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి అండగా ఉంటారని, భవిష్యత్తులోనూ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు విజయభాస్కర్, బళ్లారి మల్లేష్, సాయి, శ్రీకాంత్, బసవ, గోవిందు, సిద్ధేశ్ తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.

మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు, కార్యకర్తలు ప్రార్థించారు..

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save