Amaravathi Velugu
Date of Publish : 16/11/2026, 4:30 pm
Published by D BHASKAR

అపుస్మా అభివృద్ధికి ఐకమత్యంతో ముందుకు సాగాలి...ఎం.వి. సుబ్బారెడ్డి.

  • అపుస్మా సర్వేపల్లి, రాపూరు యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు మండలం వరదాపురంలోని శ్రీ సాయినాథ హైస్కూల్‌లో అపుస్మా (APPUSMA) సర్వేపల్లి, రాపూరు యూనిట్ సర్వసభ్య సమావేశం ప్రస్తుత రాపూరు యూనిట్ అధ్యక్షులు బి. మునీంద్ర రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో అపుస్మా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో నిర్వహించనున్న MMTSE, SAT పరీక్షలతో పాటు మనోహర్ రెడ్డి మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ వంటి కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి, యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం అపుస్మా సర్వేపల్లి, రాపూరు యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు ఎం.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి, ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కొండారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ సభ్యులుగా గౌరవాధ్యక్షులుగా కె. సురేష్, అధ్యక్షులుగా బి. శివకుమార్, కార్యదర్శిగా డి. శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా పి. పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా ఎం. మునిప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా పి. కోదండరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా యూసీ పెంచలయ్య, ఎండీ. గౌస్, అంకయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు ఎం.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ అపుస్మా బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేయాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని సూచించారు. విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఎడిఫై స్కూల్ కరస్పాండెంట్‌తో పాటు పలువురు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో అపుస్మా సర్వేపల్లి, రాపూరు యూనిట్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save