Amaravathi Velugu
Date of Publish : 16/11/2026, 4:58 pm
Published by D BHASKAR

విద్యార్థి దశ నుంచే ఓటు విలువ తెలుసుకోవాలి.

  • శ్రీ గాయత్రి స్కూల్లో విద్యార్థులకు ఎలక్షన్ డే కార్యక్రమం.
  • కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:ప్రతి విద్యార్థి తన విద్యార్థి దశ నుంచే వజ్రాయుధం లాంటి ఓటు విలువ తెలుసుకోవాలని, అప్పుడే నవ సమాజ నిర్మాణం జరుగుతగుందని శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం తమ స్కూల్లో విద్యార్థులకు ఎలక్షన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఓటు అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే కలిగే అనార్ధాల గురించి వివరించారు. అలాగే ఎలక్షన్ బూత్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందో డెమో రూపంలో చూపించారు. ఏఏ అధికారులు వుంటారు, వారి విధులు ఏమిటి అనే అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save