కదిరి, నవంబర్ 16 (అమరావతి వెలుగు) కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. డిసెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న కార్మికుల మహా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా సోమవారం కదిరి సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐటీయూ కదిరి పట్టణ కార్యదర్శులు బాబ్‌జాన్, రామ్మోహన్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనంగా నెలకు రూ.42 వేలు చెల్లించాలని కోరారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఢిల్లీ ముట్టడిలో కార్మికులు, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీలు శివప్రసాద్, ఫక్రుద్దీన్, రాము, మహబూబ్‌బాషా, గంగాద్రి, నరసింహ, కదిరప్ప, చిన్నరాయుడు, కలందర్, షాకీర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
EDITOR : Janapati Venkata Ramesh Babu