Amaravathi Velugu
Date of Publish : 17/11/2026, 1:31 pm
Published by D BHASKAR

గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా.

  • నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటా వారి సమస్యలు పరిష్కరిస్తా...2వ వార్డు కూటమి అభ్యర్థిగా బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:పట్టణంలోని 2వ వార్డు కూటమి అభ్యర్థిగా బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన, పార్టీ బలోపేతానికి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన మల్లికార్జున్ నాయుడు పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

గతంలోనూ పార్టీ తరఫున వివిధ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన, ప్రస్తుతం 2వ వార్డు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఆయన పోటీ చేస్తుండటంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. వార్డు అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా నిలవనున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save