Amaravathi Velugu
Date of Publish : 16/10/2026, 8:10 pm
Published by Janapati Venkata Ramesh Babu

జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్!

  • కండరాల పెరుగుదలకు గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ మేలు
  • శక్తిని తిరిగి పొందేందుకు అన్నం, రొట్టె, ఓట్స్, అరటిపండ్లు
  • ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిపిన సమతుల్య ఆహారం ముఖ్యం
  • వ్యాయామం తర్వాత తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు

జిమ్‌లో కష్టపడి వ్యాయామం చేసిన తర్వాత కండరాలు త్వరగా పెరగాలంటే ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు, సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాలా? చాలామందిలో ఉండే ఈ సందేహానికి సమతుల్య ఆహారమే సమాధానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం సమయంలో శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది. కండరాలపై పడిన ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, వాటి మరమ్మతు, పెరుగుదలకు తగిన పోషకాలు అవసరమవుతాయి. రోజువారీ ఆహారంలోనే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకుంటే శరీరానికి అవసరమైన పోషణ అందుతుంది. గుడ్లు, పప్పుధాన్యాలు, పెరుగు, పనీర్, చికెన్, చేపలు, టోఫు వంటి ఆహార పదార్థాలు ప్రొటీన్లకు మంచి వనరులు.

వ్యాయామం తర్వాత కండరాల రికవరీతో పాటు ఖర్చయిన శక్తిని తిరిగి పొందడం కూడా ముఖ్యం. ఇందుకు అన్నం, రొట్టె, ఓట్స్, బంగాళాదుంపలు, అరటిపండ్లు వంటి కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు కలిపిన భోజనం తీసుకోవచ్చు. రొట్టెలతో పాటు చికెన్ లేదా పప్పు కూర, గుడ్లతో హోల్‌గ్రెయిన్ బ్రెడ్, పనీర్ లేదా టోఫుతో చేసిన కూర వంటి ఎంపికలు కూడా మంచివే. పెరుగులో పండ్లు, కొద్దిగా గింజలు కలిపి తీసుకోవచ్చు. వ్యక్తి బరువు, వ్యాయామ తీవ్రత, కండరాల పెరుగుదల లక్ష్యం, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి అవసరమైన పోషకాల పరిమాణం మారుతుంది.

వ్యాయామం ముగిసిన వెంటనే తప్పనిసరిగా తినాలనే కఠినమైన నియమం లేదు. సాధారణంగా ఒకటి నుంచి రెండు గంటల్లో సమతుల్యమైన భోజనం లేదా చిరుతిండి తీసుకోవచ్చు. రోజంతా సరిపడా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అందుతున్నాయా అనేది కూడా ముఖ్యమే. వ్యాయామం సమయంలో చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేసేందుకు తగినంత నీరు తాగాలి. ఎక్కువసేపు లేదా అధిక తీవ్రతతో వ్యాయామం చేసేవారికి ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల అవసరం పెరగవచ్చు. ఖరీదైన సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడకుండా, అందుబాటులో ఉన్న పోషకాహారాన్ని సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా కూడా ఫిట్‌నెస్ లక్ష్యాల దిశగా ముందుకు సాగవచ్చు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save