Amaravathi Velugu
Date of Publish : 17/10/2026, 11:10 pm
Published by Janapati Venkata Ramesh Babu

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై చైతన్యం కలిగించే లఘు చిత్రాలు రూపొందించాలి

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యువ దర్శకులు, ఫిలిం మేకర్లు లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు, లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు. యువతలో దాగి ఉన్న సినీ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్‌ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save