Amaravathi Velugu
Date of Publish : 22/10/2026, 1:19 pm
Published by Janapati Venkata Ramesh Babu

టీడీపీ సీనియర్ నేత యనమలకు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా

  • కాకినాడలోని ప్రైవేట్ ఆసుప‌త్రికి తరలింపు
  • ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. యనమల కుటుంబ సభ్యులు, ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. యనమలకు అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం యనమల రామకృష్ణుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని పార్టీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆదేశించారు. యనమల అస్వస్థతకు గల కారణాలు, ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save