Amaravathi Velugu
Date of Publish : 22/10/2026, 1:37 pm
Published by Janapati Venkata Ramesh Babu

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

  • దేశ భద్రత, ఐక్యత కోసం షా కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడిన సీఎం
  • అమిత్ షాకు బర్త్‌డే విషెస్ తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్
  • ఏపీకి అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు చెప్పిన లోకేశ్

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత, అఖండత కోసం అమిత్ షా చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. "అమిత్ షా గారి సమర్థవంతమైన నాయకత్వం, దేశ రక్షణ కోసం ఆయన పడుతున్న అలుపెరుగని తపన అందరికీ స్ఫూర్తిదాయకం. దేశ భద్రత, ఐక్యత పట్ల మీకున్న అంకితభావం ఎంతో ప్రశంసనీయం" అని పేర్కొన్నారు. అమిత్ షా నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దేశానికి మరెన్నో ఏళ్ల పాటు సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "దేశాన్ని సురక్షితంగా ఉంచాలన్న మీ దృఢ సంకల్పం, సమైక్య భారతం కోసం మీరు చేస్తున్న నిరంతర కృషి లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది" అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు అమిత్ షా అందిస్తున్న అండదండలకు లోకేశ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save