అక్టోబర్ 22 : ఎన్నికలలో గెలవడం కోసం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి 18000 ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తానంటాడు.గెలిచిన తర్వాత ఇవ్వడు. అసలు ఎన్నికల ప్రక్రియనే ఎన్నికల కమిషన్ నుండి తమ చేతుల్లోకి తీసుకొని నామినేషన్లు వేయకుండా చేస్తాడు. ఒకవేళ నామినేషన్ వేసినా స్క్రూట్ నీలో తొలగిస్తాడు. ఒకవేళ అక్కడ కూడా నెగ్గితే పోలింగ్ రోజు రిగ్గింగ్ చేసు కుంటాడు. ఇంత సిగ్గుమాలిన స్థితికి దిగజారిన చంద్రబాబు
కు సుప్రీం కోర్టు కర్ర కాల్చి వాత పెట్టింది. ఎన్నికల ప్రక్రియ అంటే బాబు ఇంటి పని కాదని,స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సాఫీగా కొనసాగించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని,హింస జరిగి నామినేషన్లు వేయకుండా అడ్డుపడిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని,ప్రతిపక్ష ఇండిపెండెంట్,అభ్యర్థులకు భద్రత కల్పించాలని,జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసుల్లో నామినేషన్ పత్రాలు తీసుకోవాలని,అది ఈరోజే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని,నిర్ణయం తీసుకున్న తరువాత 48 గంటలు సమయం ఇవ్వాలని.అంతవరకు ఈ 19 మున్సిపాలిటీలలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించవద్దని, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాల పై ఉందని, ఇంత అరాచకం జరిగినా ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా రాలేదని ఈ ప్రభుత్వం చెప్పడం దారుణమని,జరిగిన సంఘటనలను వీడియోలు చూసిన తర్వాత మాకు అర్థమయిందని, హింస జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే నామినేషన్ వేయడానికి ఎవరూ వస్తారని,ప్రజాస్వామ్యంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని,ప్రతిపక్షాలకు నామినేషన్ వేసే అవకాశం ఉండాలని,తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండడానికి అర్హత లేదు.నైతిక బాధ్యత వహించి తనకు తానుగా రాజీనామా చేయాలి.అలాగే 19 మున్సిపాలిటీలు ఏ జిల్లాల పరిధిలో ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్, డీఐజీ,ఎస్పీ,డి.ఎస్.పి లను తక్షణం సస్పెండ్ చేసి,ఒక స్వతంత్ర సంస్థతో నెల రోజులలో విచారణ చేయించి,నిజాలను నిగ్గు తేల్చి కఠినంగా శిక్షించాలి. ఈ శిక్షలు భవిష్యత్తులో ఏ అధికారి కూడా ఇలా చేయడానికి భయపడే టట్లు ఉండాలి.అలాగే నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసకాండ కు సంబంధించిన ఆధారాలను మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లు సమర్పించినా పట్టించుకోని ఎస్ఈ సీని వెంటనే తొలగించాలి.అప్పుడు గాని ఎన్నికలు సజావుగా జరగవు. అధికారంలో ఉన్నవారికి అధికార మదం తగ్గదు.ఈ విషయమై రాష్ట్ర ప్రజలందరూ ముక్కుమ్మడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సీఈకి మెసేజ్ ల ద్వారా తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి,లేకుంటే కక్షలు కార్పణ్యాలతో రాష్ట్రం అగ్నిగుండమైపోతుంది.