Amaravathi Velugu
Date of Publish : 23/10/2026, 7:55 am
Published by Janapati Venkata Ramesh Babu

ఎన్నికల విధుల నుంచి పులివెందుల డీఎస్పీని తొలగించాలి: హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్

  • వైసీపీ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశం
  • తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆలపాటి గిరిధర్ విచారించారు. ఎన్నికల విధుల నుంచి డీఎస్పీని ఎందుకు తొలగించాల్సి ఉందో వివరించాలని కోరుతూ వాదనలు జరిగాయి. అనంతరం, ఈ విషయంపై పూర్తి వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు.

వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరడంతో, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save