Amaravathi Velugu
Date of Publish : 24/10/2026, 6:38 pm
Published by Janapati Venkata Ramesh Babu

గ్రామీణ క్రికెట్ ప్రతిభకు ఆర్డీటి టాలెంట్ హంట్ ద్వారా ప్రోత్సాహం

  • నేడు అనంత క్రీడా గ్రామంలో టాలెంట్ హంట్ రెండో దశ రెండవ రోజు
  • ధర్మవరం, కదిరి అండర్ 15 విభాగం నుంచి 71 మంది హాజరు
  • మచ్చా రామలింగారెడ్డి - చైర్మన్ క్రికెట్ డెవలప్మెంట్ ఆర్డిటి

అనంతపురం : గ్రామీణ క్రికెట్ ప్రతిభకు ఆర్డిటి టాలెంట్ హంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సాహాన్ని అందిస్తుందని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్ అనంతపురం జిల్లాలోని యువతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ అన్నారు  ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టాలెంట్ హంట్ రెండో దశ నేడు ఆర్డిటి క్రీడా మైదానంలో రెండోవ రోజు సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టాలెంట్ హంట్‌ రెండో దశ సెలక్షన్స్‌ రెండో రోజు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి. ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 24, 2026న నిర్వహించిన ఎంపికలకు ధర్మవరం నియోజకవర్గం, కదిరి ప్రాంతాల నుంచి మొత్తం 71 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ధర్మవరం, కదిరి ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు సెలక్షన్స్‌లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి దశ సెలక్షన్స్ కు ఎంపిక చేయనున్నట్లు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువ క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పించేందుకు ఆర్డీటీ చేపట్టిన ఈ టాలెంట్ హంట్‌కు ధర్మవరం, కదిరి ప్రాంతాల నుంచి మంచి స్పందన లభించింది అని తెలిపారు

ఈ కార్యక్రమంలో సీనియర్ క్రికెట్ ప్లేయర్ వెంకటేష్, కోఆర్డినేటర్ ప్రవీణ్, సెలెక్టర్లు ప్రదీప్, విజయరాజు, యోగానంద, ప్రశాంత్ రెడ్డి కోచ్ లు రఫీ, ఇనయతుల్ల, రాజశేఖర్ పాల్గొన్నారు. ఆర్డిటి రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ రెండోవ దశకు ఎంపిక అయిన అనంతపురం పట్టణ అండర్-15 క్రికెటర్లకు రేపు సెలక్షన్స్ అక్టోబర్ 25, ఆదివారం ఉదయం 9 గంటలకు ఆర్డీటీ క్రీడా మైదానంలో అనంతపురం పట్టణానికి చెందిన యువ క్రికెటర్లకు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆర్డీటీ టాలెంట్ హంట్ కమిటీ తెలిపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save