Amaravathi Velugu
Date of Publish : 26/10/2026, 6:37 pm
Published by Janapati Venkata Ramesh Babu

మర్రిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి పది కుటుంబాలు వెల్లువలా చేరికలు .

పొదలకూరు

అమరావతి వెలుగు

మండలంలోని మర్రిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది కుటుంబాలు టీడీపీలో చేరాయి. స్థానిక టీడీపీ నాయకుల సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారు టీడీపీ విధానాలు, స్థానికంగా పార్టీ నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో వరుసగా జరుగుతున్న చేరికలు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.మర్రిపల్లి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలు టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రంలో రసమచంద్రయ్య గౌడ్,రాజగుంట. దశయ్య, చెమిడిబోయిన జనార్ధన్, పర్చూరు లక్ష్మయ్య, వెంపులూరు విజయ్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save