Logo
Date of Publish : 26 September 2026, 5:53 am
Editor : Janapati Venkata Ramesh Babu

టీడీపీలో చేరిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు

కదిరి, సెప్టెంబరు 26: కదిరి పట్టణంలోని 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కటిక షేక్‌ హస్నూ ఆధ్వర్యంలో బాబా, రఫీక్‌, షాజహాన్‌, నౌషాద్‌, పీరా, రియాజ్‌, మస్తాన్‌, అషరఫ్‌ అలీ, భాష, ఇమ్రాన్‌, మహాభాష తదితరులు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )