04/11/2026, Wednesday · 09:41:55 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu
Amaravathi Velugu

This is Short News — best viewed on mobile.

News ePaper
D
D BHASKAR · Reporter
2 days ago

సోమవారం పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు.. జిల్లా కలెక్టర్ హిమాన్షు

నెల్లూరు : మురసు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నవంబర్ 02న (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ,పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్,జానియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

C
chalapathi · Staff Reporter
8 days ago

తీవ్ర తుఫాన్‌గా అర్నబ్‌.. ఏపీకి హెచ్చరిక

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్‌.. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 28న ఉదయం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని సమాచారం. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

D
D BHASKAR · Reporter
8 days ago

పొదలకూరు యమహా షోరూమ్ లో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.

పొదలకూరు పొదలకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. యమహా షోరూంలో పనిచేస్తున్న మోహిత్(29) బైక్‌కు వాటర్ సర్వీస్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మోహిత్ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

D
D BHASKAR · Reporter
8 days ago

నేడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

పొదలకూరు సోమవారం సాయంత్రం 4 గంటలకు బిరదవోలు ఎంపిటిసి సెగ్మెంట్ పరిధి లోని మర్రిపల్లి పంచాయతీ లో సర్వేపల్లి ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పొదలకూరుటీడీపీ మండలాధ్యక్షులు తలచీరుమస్తాన్ బాబు అన్నారు. కావున టిడిపి బిజెపి జనసేన కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

రైతుపై మళ్లీ భారం.. భూమి శిస్తు వసూలుకు మంత్రి పొంగులేటి

నాలుగు దశాబ్దాల క్రితం రైతులకు భారంగా మారిన భూమి శిస్తును ఎన్టీఆర్‌ 1984లో రద్దు చేశారు. శిస్తు చెల్లించలేక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికారుల వేధింపులు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ భూమి శిస్తు వసూలుకు సిద్ధమవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

ఏషియన్ గేమ్స్ హీరోలకు మోదీ నినాదం.. మనం చేసి చూపిద్దాం!

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. “మనం చేసి చూపిద్దాం” అంటూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. భారత్‌ను ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలపడమే లక్ష్యమన్నారు. క్రీడాకారుల విజయాలను అభినందిస్తూ, కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని కొనియాడారు.

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మ బహూకరించిన లోకేశ్

మంత్రి నారా లోకేశ్ విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవానికి ప్రతీకగా మంగళగిరి చీర, హస్తకళలకు గుర్తింపుగా ఏటికొప్పాక లక్క బొమ్మలను బహూకరించారు. దసరా ఉత్సవాలు, జాతీయ సరస్ మేళాలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు వీఐపీ, సిఫార్సు దర్శనాలను రద్దు చేశారు. ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతిస్తూ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,47,430గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా నమోదైంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలో రూ.2,29,900కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,47,580గా ఉంది. ధరలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు తాజా రేట్లు పరిశీలించాలి.

JANAPATI VENKATA RAMESH BABU · Editor
18 days ago

ఏఐ వార్మ్‌లతో ప్రపంచానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక!

ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల్లోకి చొరబడి, వాటి నుంచి ఇతర పరికరాలకు వ్యాపించే ఏఐ వార్మ్‌లపై ఆంథ్రోపిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఐఓటీ పరికరాలను ఇవి లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన ఈ ముప్పు సైబర్ భద్రతకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.