
శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రి ( కదిరి కొండ ) గిరి ప్రదక్షిణలో భక్తాదులు 15.09.26 తేదీన మంగళవారం 6.00 గంటల నుంచి గోవింద నామస్మరణతో స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో పెద్దయెత్తున పాల్గొని శ్రీ వారి కృపకు పాత్రులు అవుదాం.
గమనిక : శ్రీ వారి తూర్పు రాజగోపురం వద్ద ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా “శ్రీ కొండల లక్ష్మీ నరసింహ స్వామి” ( కదిరి కొండ ) ఆలయం వద్ద నుంచే శ్రీ వారి స్తోత్రాద్రికి ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది.
శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం “శ్రీ పచ్చిపులుసు నరేంద్ర బాబు గారు వారి సతీమణి పచ్చిపులుసు హరి కృప గారు” కదిరి కొండ కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వద్ద మహాప్రసాద వితరణ ( అల్పాహారం ) చేస్తున్నారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్రసాద వితరణలో స్టీల్ ప్లేట్లను ప్రవేశపెట్టడం జరిగింది.ప్రసాదం స్వీకరించిన అనంతరం శ్రీ వారి భక్తులే శుభ్రం చేసి యధాస్థానంలో ఉంచుతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.








