కదిరి: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని  ఎరుకులవాండ్లపల్లెకు చెందిన 15 ఏళ్ల వయస్సు గల బాలుడు యశ్వంత్‌  అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల మేరకు తండ్రి రమేష్‌ తన కుమారుడైన యశ్వంత్‌ కదిరిలోని రిపబ్లిక్‌ ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఐటీఐకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి వెళ్లాడని తెలిపారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో తండ్రి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి రూరల్‌ పోలీసులు అదృశ్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యశ్వంత్‌ ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా కదిరి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.