37వ వార్డులో కూటమి ప్రచారం జోరు

- ఇంటింటికీ వెళ్లి మద్దతు కోరిన ఎమ్మెల్యే కందికుంట
కదిరి (అమరావతి వెలుగు): కదిరి పట్టణంలోని 37వ వార్డులో కూటమి మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుతో పాటు, 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్. రూపను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...











