వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా

అమరావతి వెలుగు
వెంకటగిరి:టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలి.. దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి
తిరుపతి జిల్లా వెంకటగిరి
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ ప్రజలకు వెంకటగిరి ఎస్సై ఎస్.కె. ఖాదర్ బాషా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఎస్సై ఖాదర్ బాషా మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. టపాసుల విక్రయాల సమయంలో ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
అదేవిధంగా దీపావళి టపాసులు కాల్చే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. టపాసులు కాల్చేటప్పుడు సమీపంలో ఇసుక, నీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై ఖాదర్ బాషా విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...











